Thursday, 10 June 2010

20 va shathabdam-Ammanu michi

అమ్మని మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మని మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలీ
సుగున రాశి సీత లాగ తానూ
కోటి ఉగాదులే నా గడపకు తేవాలీ
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
ఇల లోగిలి కోవెలగా మారాలీ...
అమ్మని మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

తప్పటడుగులేసిన చిననాడూ
అయ్యో తండ్రీ అని గుండెకద్దుకున్నావూ
తప్పటడుగులేస్తే ఈనాడూ
నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడూ
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే

అమ్మని మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

0 comments:

Post a Comment