Thursday, 10 June 2010

Indira-lali lali anu

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్నపోదా మరీ చిన్నప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీ వేణుగాణం
కళ్ళుమేలుకుంటె కాలం ఆగుతుందా భారమైన మనసా...ఆ
పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంతం వేళా

ఎటో పోతోంది నీలిమేఘం వర్షం మెరిసిపోదా
ఏదో అంటుంది కోయిల శోకం రాగం మూగపోగా
అన్నివైపులా మధువనం ఎండిపోయెనే ఈ క్షణం
అణువణువునా జీవితం అడియాసకే అంకితం

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్నపోదా మరీ చిన్నప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే
అంతచేదా మరీ వేణుగాణం
కళ్ళుమేలుకుంటె కాలం ఆగుతుందా భారమైన మనసా...ఆ
పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంతం వేళా
లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్నపోదా మరీ చిన్నప్రాణం

0 comments:

Post a Comment