Thursday 10 June 2010

Swathi mutyam-chinnri ponnari

చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్
అమ్మ నన్ను తిట్టింది బాబోయ్
ఊరుకో నా నాన్నా నిన్నూరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవలు కొట్టారమ్మా

నల్లనయ్య కనరాక తెల్లవార్లు నిదరోక
తల్లి మనసు తానెంత తల్లడిల్లిపోయిందో
వెన్నకై దొంగలా వెళ్ళితివేమో
మన్ను తిని చాటుగా దాగితివేమో
అమ్మా మన్ను తినంగ నే చిచువును ఆకొంతిను వెదినో చూడు నోలు ఆ
వెర్రిదీ అమ్మేరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వెర్రిదీ అమ్మేరా పిచ్చిదామె కోపం రా
పచ్చికొట్టి వెళ్దామా బూచికిచ్చి పోదామా
ఊ ఊ ఊ ఏడుపొత్తోంది నాకేడుపొత్తోంది
పచ్చికొట్టి పోయామా పాలెవలు ఇత్తారు
బూచాడికి ఇచ్చామా బువ్వెవలు పెడ్తాలు చెప్పు
అమ్మతోనె వుంటాము అమ్మనొదిలి పోలేము
అన్నమైన తింటాము తన్నులైన తింటాము
కొత్తమ్మ కొత్తు బాగా కొత్తు ఇంకా కొత్తు కొత్తూ
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
తిన్నాలి పొన్నాలి కిట్టయ్య నిన్నెవలు కొట్టాలు నాన్నా ఎవలమ్మా

చిన్నవాడవైతేను చెయ్యెత్తి కొట్టేను
పెద్దవాడవైతేను బుద్దిమతి నేర్పేను
యశోదనూ కానురా నిన్ను దండించ
సత్యనూ కానురా నిన్ను సాధించ
ఎవ్వరు నువ్వనీ ఈ ఈ ఈ ఈ ఈ
ఎవ్వరు నువ్వనీ నన్ను అడుగకు
ఎవరు కానని విడిచీ వెళ్ళకు
నన్ను విడిచీ వెళ్ళకు
ఆ వెళ్ళము వెళ్ళములేమ్మా

చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
అమ్మ నన్ను కొట్టింది బాబొయ్
అమ్మ నన్ను తిట్టింది బాబొయ్
ఊరుకో నా నాన్నా ఆహా ఊలుకోను
నిన్నూరడించ నేనున్నా
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య
చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య

0 comments:

Post a Comment