Thursday, 10 June 2010

Srivariki Premalekha-tholisari mimmalni

తొలిసారి మిమ్మల్ని చూసిందీ మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ
ఎన్నెన్నో కథలూ
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో...జో...
నిదురపోలేని కనుపాపలకూ జోల పాడలేకా
ఈల వేసి చంపుతున్న ఈడూనాపలేకా
ఇన్నాళ్ళకు రాస్తున్నా మ్మ్..మ్మ్ ప్రేమలేఖా
తొలిసారి మిమ్మల్ని చూసిందీ మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ
ఎన్నెన్నో కథలూ

ఏ తల్లి కుమారులొ తెలియదు కానీ
ఎంతటి సుకుమారులో తెలుసు నాకూ
ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ
నా మనసును దోచినా చోరులు మీరూ
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండీ చప్పున బదులివ్వండీ
తొలిసారి మిమ్మల్ని చూసిందీ మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ
ఎన్నెన్నో కథలూ

0 comments:

Post a Comment